గిరిజనుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని, వాటిని అందిపుచ్చుకొని గిరిజనులు ఉన్నత స్థితికి ఎదగాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ ఆకాంక్షించారు. శనివారం నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ప్రత్యేక పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు.