ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని పుట్టపాశం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బైక్ ను కారు ఢీకొనగా పుట్టపాశం గ్రామానికి చెందిన బోయ చరణ్(17) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం గోనెగండ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కొరకు కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.