వేంపల్లె: సమతుల్య ఆహారం తీసుకుంటే క్యాన్సర్ దూరం
ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం తీసుకుంటే క్యాన్సర్ దరి చేరదని పి. హెచ్. సి డాక్టర్ చందన పేర్కొన్నారు. గురువారం సాయంత్రం వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ త్రిబుల్ ఐటీలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చందన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.