కడప: వర్రా రవీందర్‌రెడ్డి కోసం గాలింపు
వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త, వర్రా రవీందర్‌రెడ్డి కోసం వైఎస్సార్ జిల్లా పోలీసుల గాలింపు కొనసాగుతోంది. 4 ప్రత్యేక బృందాలు అతడి ఆచూకీ కోసం యత్నిస్తున్నాయి. హైదరాబాద్,బెంగళూరుతో పాటు కమలాపురం, పులివెందుల ప్రాంతాలకు పోలీసు బృందాలు వెళ్లాయి. రవీందర్‌రెడ్డి వాడే రెండు ఫోన్లూ స్విచ్చాఫ్‌లో ఉన్నాయని, అన్ని రకాలుగా నిఘా పెట్టామని పోలీసు అధికారులు తెలిపారు. 41-ఏ నోటీసులిచ్చి వదిలేశాక రవీందర్‌రెడ్డి పారిపోయాడు.