నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ ఆయుష్మాన్ వైద్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ డాక్టర్ శబరి సోమవారం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, కమిషనర్ ఎస్ బేబీ, కౌన్సిలర్ చాంద్ భాషతో కలిసి సమీపాన ఉన్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించి తనిఖీ చేపట్టారు. విద్యార్థులు చిన్నారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.