కొత్తపల్లి మండలంలోని లిఫ్ట్ ద్వారా ప్రతి ఎకారాకు సాగునీరు అందించాలని, హమాలీలకు విశ్రాంతభనం కోసం స్థలం మరియు భవన నిర్మాణం చేయాలని, అలాగే మండలంలోని నీటిముంపు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని సీపీఎం నాయకులు స్వాములు, సీపీఐ మండల కార్యదర్శి వెంకటశివుడు, బొల్లు ప్రసాద్ బాబు యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో, ఎమ్మెల్యే జయసూర్యకు వినతి పత్రాలు అందించారు.