నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ లో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే జయసూర్యకు సోమవారం సిపిఎం బృందం సమస్యలు వెంటనే పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్య దర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరావు, నాయకులు పక్కిర్ సాహెబ్, గోపాలకృష్ణ మాట్లాడుతూ. మిడుతూరు మండల కేంద్రంలోని 40 దళిత కుటుంబాలకు 1996 లో అలగనూరు పొలిమేరలో పట్టా, పాస్ పుస్తకాలు ఇచ్చి బ్యాంక్ లో పంట రుణాలు తెచ్చుకోవడం జరుగుతుంది. ఇంతవరకు వారికి భూములు చూపలేదు వెంటనే వారికి భూములు చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు ప్రజా సంఘాలు పాల్గొన్నారు.