బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన వై.ప్రదీప్ రెడ్డి

68பார்த்தது
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన వై.ప్రదీప్ రెడ్డి
మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామ మోడల్ స్కూల్ హాస్టలో ఆదివారం రాత్రి 10వ తరగతి విద్యార్థిని పార్వతి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు వైస్సార్సీపీ నేతలు వై. ప్రదీప్ రెడ్డి సోమవారం హాస్టల్ వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఆత్మహత్యకు గల కారణాలను పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ శివనారయణ శర్మను కోరారు. పార్వతి సమీప బంధువులకు తక్షణ సాయం కింద రూ. 10 వేల నగదును అందజేశారు.

தொடர்புடைய செய்தி