కోడుమూరు నియోజకవర్గ కేంద్రమైన కోడుమూరులో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగప్ప, అబ్దుల్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ వెంకటేష్ నాయక్ కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడారు. అధికారం చేపట్టిన 100 రోజుల్లో ప్రభుత్వ విద్యా విధానంలో సమూల మార్పులు తెస్తామని యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని విస్మరించారన్నారు.