ఆళ్లగడ్డ మండలం సమస్యత్మకగ్రామమైన అహోబిలంలో ఆదివారం ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు కార్డెన్ సెర్చ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని అనుమానాస్పద ఇళ్లల్లో విస్తృత సోదాలను నిర్వహించారు. ఆళ్లగడ్డ రూరల్ సీఐ కంబగిరి రాముడు రూరల్ ఎస్సై హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఇద్దరు సిఐలు 10 ఎస్ఐలు 60 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డీఎస్పీ రవికుమార్ ఆదేశాల మేరకు అహోబిలంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించామని అన్నారు.