ఆదోని పట్టణంలోని సాయిబాబా నగర్ లో అనధికారికంగా నిర్వహిస్తున్న మెకానిక్ షెడ్లను తొలగించాలని కాలనీవాసులు కోరారు. ఆదివారం ఆదోనిలో సాయిబాబా నగర్ కాలనీవాసులు ఎమ్మెల్యే పార్థసారథికి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. రెసిడెన్షియల్ ఏరియా అయినప్పటికీ కమర్షియల్ గా షాపులు మెకానిక్ షెడ్లు, వెల్డింగ్ షాప్, బీఫ్ బిర్యాని హోటల్స్ ఏర్పాటు చేసి ఏరియాలో సౌండ్ పొల్యూషన్, ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారన్నారు.