కురువ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన మాన్వి దేవేంద్రప్ప కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజును కలిశారు. ఆదివారం కర్నూలులో దేవేంద్రప్ప ఎంపీని కలిసి శాలువతో సత్కరించారు. వారు మాట్లాడారు. రాష్ట్రంలో కురువలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా, ఎంపీ నాగరాజుతో కలిసి కురువలకు ఇవ్వాల్సిన మాదారి కురువలకు ఎస్సీ సర్టిఫికెట్లపై అధికారులకు సూచనలు ఇచ్చే విధంగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతామన్నారు.