ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ స్టాంపుల మంత్రి అనగాని సత్య ప్రసాద్ ను ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆదోనిలో తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ భవనాలు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయని, వాటిని పునరుద్ధరించాలని. అందుకు వెంటనే నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతిపత్రం సమర్పించారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.