AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది మంగళవారం తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల్లో శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు వెళ్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రానున్న 2 రోజుల్లో ఏపీలోని నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.