ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమములో భాగంగా నందికొట్కూరు పట్టణంలోని పారడైజ్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే జయసూర్య ఆధ్వర్యంలో గురువారం ప్రజా వేదిక నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు అయిన సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీలో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. బేబీ, సచివాలయ ఉద్యోగులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.