నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని దుద్యాల గ్రామంలో ఎమ్మెల్యే జయసూర్య మంగళవారం పర్యటించారు. నాయకుల సమాచారం మేరకు శిథిలావస్థకు చేరిన మండల పరిషత్ ఉర్దూ పాఠశాల మరియు వెటర్నటీ హాస్పిటల్ ను పరిశీలించారు. పాఠశాల రికార్డులను తెప్పించుకొని తనిఖీ చేశారు. శిథిలావస్థకు చేరిన భవనాల కు మరమ్మతులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేంద్ర నాథ్ రెడ్డి నారపరెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.