మంత్రాలయం మండల పరిధిలో అక్రమ మద్యం వ్యాపారం, ఇసుక రవాణా మీద నిఘా ఉంచామని సిఐ రామాంజులు, ఎస్సై పరమేష్ నాయక్ తెలిపారు. బెల్టు షాపుల నిర్వాహకులను అదుపులోకి తీసుకుని, ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా భయబ్రాంతులకు గురి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శుక్రవారం హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.