కోసిగి సర్కిల్ కార్యాలయంలో నలుగురు మట్కా బీటర్లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు శనివారం డీఎస్పీ ఉపేంద్రబాబు తెలిపారు. కోసిగిలో ఆయన వివరాలు తెలిపారు. మట్కా బీటర్ల నుంచి 705 కర్ణాటక మద్యం ప్యాకెట్లతోపాటు మట్కా చీటీలు రూ. 2, 7300 నగదు, నాలుగు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మట్కా రాయుళ్లపై కేసులు నమోదు చేసి, రిమాండ్ కు తరలించినట్లు సీఐ మంజునాథ్, ఎస్సై చంద్రమోహన్ తెలిపారు.