కర్నూలు జిల్లా వ్యాప్తంగా వర్షాలు.. కృష్ణగిరిలో 48. 2 మి. మీలు
కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా కృష్ణగిరిలో 48. 2 మి. మీ. వర్షపాతం నమోదైంది. కల్లూరులో 24. 8, ఓర్వకల్లో 22. 4, వెల్దుర్తిలో 20. 4, పత్తికొండలో 17. 4, గూడూరులో 15. 2 మి. మీ. ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తంగా సగటున 12. 6 మి. మీ. వర్షపాతం నమోదైంది.