కోడుమూరు హంద్రీ నది నుంచి అక్రమంగా ఇతర ప్రాంతాలకు ఇసుక తరలించే ట్రాక్టర్లను సీజ్ చేస్తామని తహసీల్దార్ వెంకటేష్ హెచ్చరించారు. శుక్రవారం వర్కూరులో మాట్లాడారు. హంద్రీ నుంచి స్థానికులు మాత్రమే ఇసుకను తీసుకెళ్లాలని, నదీతీరాన ప్రజలు ముందస్తుగా ఉచిత ఇసుకకు అనుమతులు తీసుకున్న తర్వాతనే తీసుకెళ్లాలన్నారు. మంచినీటి బోర్లకు 200 మీటర్ల దూరంలో వాల్టా చట్టం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ఇసుకను తరలించరాదన్నారు.