కోడుమూరు: తప్పుడు కేసులు పెడితే సహించేది లేదు
By NIKHIL 52பார்த்ததுవైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే సహించేది లేదని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జోనల్ ఇన్ ఛార్జ్ ప్రభాకర్ హెచ్చరించారు. గురువారం కోడుమూరులో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతోందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు లీగల్ సెల్ అండగా ఉంటుందన్నారు.