కోడుమూరు పట్టణంలోని ఒక మహిళా ఉపాధ్యాయురాలుపై దాడి చేసి ఆమె గొంతులో ఉన్న బంగారాన్ని దొంగలించిన సంఘటన కొద్దిసేపటి క్రితం వెలుగులోకి వచ్చింది. బుధవారం కోడుమూరులోని గణేష్ నగర్లో నివాసం వుంటున్న మహిళపై ఇద్దరు చెయిన్ స్నాచర్లు దాడి చేసి, బంగారాన్ని తస్కరించారు. వేగంగా ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు ముసుగు ధరించి, దొంగతనం చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.