ఆళ్లగడ్డలో బాణాసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి అని శిరివెళ్ళ సర్కిల్ ఇన్స్పెక్టర్ వంశీధర్ మంగళవారం తెలిపారు. దుకాణాల వద్ద నిబంధనలు కఠినంగా పాటించాలంటూ సూచించారు. నివాస ప్రాంతాలు, రద్దీ కూడళ్లలో దుకాణాలు ఏర్పాటుచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాత్కాలిక లైసెన్స్ పొందినవారు మాత్రమే బాణాసంచా విక్రయాలు చేయాలని, ప్రతి దుకాణంలో అగ్ని నిరోధక సిలిండర్లు, ఇసుక, నీరు అందుబాటులో ఉండాలని చెప్పారు.