పత్తికొండ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సోమన్న, అల్తాఫ్, నజీర్ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సమస్యల కొరకు ఉద్యమాలు నిర్వహిస్తున్న ఏఐఎస్ఎఫ్ సంస్థకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించాలని జిల్లా నాయకులు కోరారు. విద్యా పరిరక్షణ కొరకు ఏఐఎస్ఎఫ్ పోరాటాలు కొనసాగిస్తుందని వాటికి సహకరించాలని విద్యార్థులను కోరారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.