మహ్మద్ ప్రవక్త బోధించిన శాంతిమార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పిలుపునిచ్చారు. సోమవారం కర్నూలులో మిలాద్-ఉన్-నబీని ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. వేడుక ఈ సందర్భంగా ఆధ్యాత్మిక సభ నిర్వహించారు. అనంతరం ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే మాట్లాడారు. మహ్మద్ ప్రవక్త సూచించిన విధంగా ప్రజలంతా శాంతియుత జీవనాన్ని ఆచరించాలన్నారు.