విజయవాడ: నిఘా పెట్టిన పోలీసులు
ఎన్టీఆర్ జిల్లా పరిధిలో బహిరంగంగా మద్యం సేవించే వారిపై పోలీసుల నిఘా ఉంటుందని ఆదివారం విజయవాడ పోలీసులు తెలిపారు. సీపీ రాజశేఖరబాబు ఆదేశాలమేరకు మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ బీట్లను ఏర్పాటు చేశామని తెలిపింది. ఇందులో భాగంగా జిల్లా పరిధిలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న పలువురిని హెచ్చరించామని సోషల్ మీడియా ద్వారా తెలిపింది.