పెడన నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన 4000 మంది ఆక్వా రైతులకు ఉపశమనం లభిస్తోందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన 132కే.వీ. స్విచ్చింగ్ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాగిత మాట్లాడుతూ, 8.18 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ రూ.48.64కోట్లతో ప్రభుత్వం నిర్మాణం చేపడుతుందని అన్నారు.