రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు
ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతోందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సౌమ్య శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. మండలంలోని చెరువు కొమ్ముపాలెం, కొత్త బెల్లంకొండ వారి పాలెం, పెద్దవరం గ్రామాలలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల క్రింద రూ. 35 లక్షల రూపాయల సీసీ రోడ్లు డ్రైన్స్ పనులకు శంకుస్థాపన చేశారు.