మైలవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు శుక్రవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇచ్చిన రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ అని అన్నారు.