వైసీపీకి మరో భారీ షాక్..!
వైసీపీకి వరసబెట్టి కష్టాలు వెంటాడుతున్నాయి. పార్టీని ఇటీవల కాలంలో నేతలు ఒక్కొక్కరుగా విడిపోతున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి కృష్ణ జిల్లాలోని కీలక నేతగా ఉన్న జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను వైసీపీని తొందరలోనే వీడిపోతున్నారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే ఆయన వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.