నాగాయలంక: రివిట్ మెంట్ కు అంచనా తయారు చేయండి
నాగాయలంక కృష్ణానది కోతకు గురికాకుండ ఉండేందుకు పుష్కర్ ఘాట్ నుండి శ్రీ రామపాదక్షేత్రం పుష్కర్ ఘాట్ వరకు రివిట్ మెంట్ చేసేందుకు అంచనా తయారు చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఇటీవల వరదలు కారణంగా మత్స్యకార భవనం వద్ద కోతకు గురైన ప్రాంతాన్ని బుధవారం పరిశీలించిన మండలి మాట్లాడుతూ కృష్ణానది కోతకు గురవుతున్న దృష్ట్యా రివిట్ మెంట్ నిర్మాణం చేసేందుకు అంచనా తయారు చేయాలన్నారు.