రాష్ట్రంలోని గ్రంథాలయాలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించాలని ఎస్సీ, ఎస్టి ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. ఘంటసాలలోని గ్రంథాలయాన్ని ఆదివారం సురేష్ బాబు సందర్శించి అక్కడ అందుబాటులో ఉన్న పుస్తకాల గురించి లైబ్రేరియన్ మోదుమూడి శరత్ ను అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ ను గ్రంథాలయంలో ఉంచాలన్నారు.