నాగాయలంకలో అసంపూర్తిగా ఉన్న జల క్రీడల శిక్షణ కేంద్రం భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు రూ. 2 కోట్లు నిధులు మంజూరు అయినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం అవనిగడ్డలోని తమ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో నాగాయలంకకు జల క్రీడల కేంద్రం మంజూరు చేస్తే వైసిపి ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న భవనాలను అసంపూర్తిగా వదిలేయడం జరిగిందన్నారు.