గత నెల వచ్చిన వరదలకు కాలిబాట కొట్టుకుపోయి అవనిగడ్డ నియోజకవర్గం పాత ఎడ్లంక గ్రామస్తులు కృష్ణా నది రేవు దాటేందుకు అవస్థలు పడుతున్నారు. వరదలు తగ్గిన నెల రోజులు అవుతున్న ఏ అధికారి, రాజకీయ నేతలు తమకు కాలిబాటనైనా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కొందరు ఎడ్ల బండిపై నది దాటారు. ఇలా ఈ సమస్యను ఎంత కాలం ఎదుర్కోవాలో అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.