అవనిగడ్డ: వైయస్ఆర్సీపీని వదిలే ప్రసక్తే లేదు

70பார்த்தது
అవనిగడ్డ: వైయస్ఆర్సీపీని వదిలే ప్రసక్తే లేదు
తాను వైసీపీని వదిలే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. బుధవారం అవనిగడ్డలో నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ, తాను పార్టీ మారుతున్నట్టు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం జరుగుతుందని, నా ప్రయాణం అంతా జగన్మోహన్ రెడ్డి తోనే సాగుతుందని తెలిపారు. ఇసుక మాఫియా జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారన్నారు.