విజయవాడ: ప్రభుత్వ తీరుపై మండిపడ్డ టిప్పర్ లారీ ఓనర్స్
ఆంధ్ర రాష్ట్ర టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టిప్పర్ లారీ ఓనర్ లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడ టిప్పర్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ఆరు ఏడు నెలల నుండి ఉపాధి లేక ఈఎంఐ లు కట్టుకునే స్థితిలో కూడా లేనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక విధానానికి కొంతమంది తూట్లు పొడుస్తున్నట్లు ఆరోపణలు చేశారు.