తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన భర్తను దూషించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యా ప్రయత్నం చేసిన తిరువూరు మండలం చిట్టేల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు భార్య కవితను విజయవాడ ఆసుపత్రిలో పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమె వెంట ఉన్నారు.