పెనమలూరు: గుంతలను, చెరువులను తలపిస్తోన్న గుడివాడ రోడ్డు
పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు నుంచి గుడివాడ వెళ్లే రహదారి అనేక పెద్ద గుంతలతో, వర్షం వచ్చినప్పుడు చెరువులను తలపిస్తుందని, ఈ రహదారిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండి, అభివృద్ధి విషయంలో చాలా వెనుకంజలో ఉందని స్థానికులు పేర్కొన్నారు. గుడివాడ రోడ్డు నిర్మాణంపై ఎప్పటికప్పుడు జాప్యం జరుగుతోందని, పాలకులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణించడం కష్టంగా మారిందని వారు తెలిపారు.