సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంద ని పెనమలూరు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త ముప్పారాజ అన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డులో జరిగిన అవినీతి అక్రమాలపై దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మద్దతుగా కంకిపాడు లోని విష్ణాలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.