కంకిపాడు పంచాయతీ కార్యాలయంలో శనివారం జరిగిన నివేశన స్థలాల లబ్ధిదారుల సమావేశంలో గందరగోళం నెలకొంది. మనఇల్లు-మన గౌరవం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ అధికారులను, ప్రజాప్రతినిధులను మహిళ లబ్ధిదారులు నిలదీశారు. అధికారులు ఇప్పటికి సరైన రోడ్డును కాలనీలోకి వెళ్ళేందుకు వేయలేదని, ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామాగ్రిని అందించలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.