అక్రమ మద్యం విక్రయాలపై విజయవాడ టాస్క్ ఫోర్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. మొవ్వ, పెడన నియోజకవర్గం బంటుమిల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం విక్రయాలపై దాడులు నిర్వహించగా, మూడు కేసులు నమోదు చేశామని ఎస్సై రామశేషయ్య తెలిపారు. 103 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.