జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని, వైసీపీ ప్రభుత్వ చేతగాని పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. బుధవారం ఈ మేరకు ఆయనకు పత్రిక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలతో అస్తవ్యస్తమైన వ్యవస్థలను గాడిలో పెడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే బాధ్యతాయుతంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.