జి.కొండూరులో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు
జీ.కొండూరు మండలంలో బుధవారం పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. గడ్డమునుగు గ్రామం దాటిన తర్వాత గంగినేని గ్రామం వెళ్ళే రోడ్డులో వీరంక్కి వింకాయమ్మ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ముగ్గురు వ్యక్తులు హెల్మెట్లు ధరించి బైక్ పై వచ్చి 3 కాసులు బంగారపు గొలుసు లాక్కొని వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.