మచిలీపట్నం: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి
క్రీడలు మానసిక ఒత్తిడి తగ్గించి, ఉల్లాసాన్ని కలిగిస్తాయని కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. మంగళవారం మచిలీపట్నంలో కృష్ణా జిల్లా పోలీసులు నిర్వహించే వార్షిక క్రీడలకు ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు, అడ్మిన్ అడిషనల్ ఎస్పీ నాయుడు, జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్. పి బి. సత్యనారాయణ పాల్గొన్నారు.