విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముగ్గురు స్కూల్ అసిస్టెంట్స్ కు పదోన్నతి కల్పించినట్టు కృష్ణా జిల్లా విద్యా శాఖాధికారి రామారావు తెలిపారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మరియు గుడివాడ మున్సిపాలిటీల పరిధిలో ఒక్కొక్క స్కూల్ అసిస్టెంట్ లకు గ్రేడ్-2 హెడ్ మాస్టర్లుగా పదోన్నతి ఇవ్వటం జరిగిందని తెలిపారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖాదికారి కార్యాలయంలో వారిని పదోన్నతి పత్రాలు అందించారు.