కృష్ణా జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ మరియు శక్తి టీం సభ్యుల ఆధ్వర్యంలో మచిలీపట్నం జార్జ్ కార్నేషన్ స్కూల్లో విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. సీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి భవిష్యత్తు కోసం చదువు కోసం కళాశాలకు పంపిస్తున్నారని, విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా మంచి ప్రవర్తనతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు.