బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జగ్గయ్యపేటమండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తాహసిల్దార్ కార్యాలయం, కార్మిక శాఖ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి షేక్ గౌస్ మియా మాట్లాడుతూ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను గత ప్రభుత్వం మెమో నెంబర్ 1214 ఇచ్చి ఆపివేసిందని తెలిపారు.