మాజీ సీఎం జగన్ ను త్వరలో కలిసి తన రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని అవనిగడ్డకు చెందిన ప్రముఖ న్యాయవాది బడే శేషగిరిరావు కుమారుడు గౌతమ్ ప్రకటించారు. శుక్రవారం మోపిదేవి ఎస్. విహార్లో ఆయన మాట్లాడుతూ ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని అన్నారు.