ఈ నెల 22వ తేదీ నుంచి ఘంటసాల మండలంలో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ బి. విజయప్రసాద్ ఆదివారం తెలిపారు. రీ సర్వే పూర్తి అయిన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అభ్యంతరాలు, ఏమైనా సమస్యలు ఉంటే రైతుల నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కరించేందుకు ఈ గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి దాలిపర్రు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ జరుగుతుందన్నారు.