చల్లపల్లి నారాయణరావు నగర్ కాలనీలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. దివ్యాంగుడైన సోమన వెంకన్నకు చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయింది. ప్రమాదంలో బాధితుడు సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో నిలిచాడు. స్థానికులు మంటలు అదుపు చేశారు. అవనిగడ్డ అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలు పూర్తిగా ఆర్పారు. రూ. లక్ష మేరకు నష్టం వాటిల్లింది.